ప్రతిసారి అవే తప్పులు చేస్తున్న కుర్ర హీరోయిన్స్..!!

-

సినిమా అవకాశాలు రావాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టపడాల్సిందే అని చెప్పవచ్చు. ఒకసారి అవకాశం వచ్చినా కూడా ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టమని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లకు పలు అవకాశాలు వచ్చినా కూడా చేజేతులారా కథల ఎంపిక విషయంలో పలు తప్పులు చేసి తమ కెరీయర్ని నాశనం చేసుకుంటున్నారు .ఆ హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటిస్తు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్న హీరోయిన్లలలో ముందు వరుసలో కృతి శెట్టి ఉందని చెప్పవచ్చు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మని చాలామంది దర్శకులు, హీరోలు సైతం దూరం పెడుతున్నట్లు సమాచారం. ఉప్పెన సినిమాతో బ్లాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె తన కెరీర్ను కోల్పోయే పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె పెట్టే కండిషన్ వల్ల కూడా పలు సినిమాలు దూరం అవుతున్నట్లు సమాచారం.

ఇక డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మరొక హీరోయిన్ శ్రీలీల ఈమె మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది .దీనికి తోడు ఆమె పెట్టిన కండిషన్స్ సినిమాలను పోగొట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది రవితేజ సరసన ఒక సినిమాతో ,హీరో రామ్ పోతినేనితో మరొక సినిమాలో నటిస్తున్నది. ఇక వీరిద్దరే కాకుండా జాతి రత్నాల సినిమాతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించిన సరియా అబ్దుల్లా, కేతిక శర్మ, శివాని రాజశేఖర్ పరిస్థితి కూడా ఇదే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తూ ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news