ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..”ఆర్ఆర్ఆర్” నుంచి భీమ్ ప్రోమో రిలీజ్‌

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా… ప్రపంచ వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. తాజాగా భీమ్ ప్రోమో ను విడుద‌ల చేసింది. ఈ ప్రోమో లో చాలా ఎన‌ర్జీటిక్ గా క‌నిపించాడు. నీళ్ల‌ల్లో ఉన్న ఎన్టీఆర్.. ఎంతో ఆక్రోశంతో… ఉన్న‌ట్లు మ‌న‌కు క‌నిపించాడు. రేపు ట్రైల‌ర్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలోనే.. ఈ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news