‘రంగమార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో

-

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో బ్రహ్మితో పాటు ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం బ్రహ్మానందంకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను వదిలింది. ఇందులో బ్రహ్మానందం తన గద్గద స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్​ బెడ్​పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల కంట కన్నీరు వచ్చింది.

ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. తమ హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని ఇలా కన్నీళ్లు పెడుతూ చూడలేమంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా మన బ్రహ్మి ముఖంలో ఏ ఎక్స్​ప్రెషన్​ అయినా ఈజీగా పండేస్తుందని మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో.. బ్రహ్మి నవ్వితేనే మనం చూడగలం.. ఏడిస్తే మనమూ ఏడ్వాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news