రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తన భార్య ఆలియా కపూర్ జంటగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ పిక్చర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మూడు పార్ట్ లు గా రాబోతున్నది.

 

పార్ట్ వన్: శివ.. ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రజెంట్ చేస్తు్న్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కుంకుమ్’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫిల్మ్ స్టోరిపైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్ర విజయంపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news