ఈ అలవాట్ల వల్ల మెదడు మందగిస్తుంది.. తగ్గించుకోకపోతే తప్పించుకోలేరు..!

-

మనిషికి మెదడు అనేది ఎంత చురుగ్గా పనిచేస్తే..ఆ వ్యక్తి అంత యాక్టివ్‌గా ఉంటాడు. మెదడు మందగిస్తే.. మన పనితీరు కూడా పడకేస్తుంది. వయసు పెరిగేకొద్ది మెదడు చురుకుదనం తగ్గుతుంది. అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల మెదడు దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. దాని ద్వారానే మతిమరుపు. వస్తుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం..
చాలామంది లేట్‌గా నిద్రలేవడం వల్ల టిఫెన్‌కు లంచ్‌కు మధ్యలో తింటారు. బ్రేక్‌ ఫాస్ట్ స్కిప్‌ చేయడం అనేది చాలా చెడ్డ అలవాటు. ఇలా అల్పాహారం మానేయడం వల్ల బరువు పెరగడమే కాకుండా.. మెదడు కూడా దెబ్బతింటుంది.
లేటుగా నిద్రపోవడం..
ఏ పని లేకపోయినా..తెల్లవారు జామున వరకూ ఫోన్లు వాడుతూ..నిద్రపోకుండా టైం అంతా వృధా చేస్తారు. రాత్రి 10 గంటల కల్లా నిద్రపోతే.. ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మనిషికి కనీసం 8 గంటల నిద్ర ఉండాలని వైద్యనిపుణులు అంటుంటే.. చాలామంది కనిష్టంగా 5 గంటల సమయాన్నే నిద్రకు కేటాయిస్తున్నారు. ఇలా లేటుగా, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది.
చక్కెర ఎక్కువ తిన్నట్లయితే..
చక్కెర ఎక్కువగా ఉండే పదార్ధాలు తింటే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట. అటు చక్కెర మోతాదు మించితే రక్తంలో షూగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకే చక్కెర పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మొబైల్ వాడకం..
ఎక్కువసేపు మొబైల్ వాడితే.. దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే అవసరమైతేనే ఫోన్ వాడాలని సూచిస్తున్నారు.
మద్యం సేవించడం..
అదేంటో కానీ.. మద్యం తాగినప్పుడు కిక్క్‌ మాత్రమే వస్తుంది. కానీ దాని తర్వాత మాత్రం బాడీలో ప్రతీ పార్ట్‌ డ్యామేజ్‌ అవుతుంది. ఒక లిమిట్‌ వరకూ తాగితే ఓకే.. లెక్క దాటితే..జబ్బులకు తిక్క లేస్తది. మద్యం తాగడం వల్ల మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదని వైద్యులు అంటున్నారు.
ఈ అలవాట్లు మీకు కూడా ఉంటే వెంటనే మానేసేందుకు ప్రయత్నించండి. మెదడు డ్యామేజ్‌ అయితే మనిషి జీవితం చాలా ప్రమాదంలో పడినట్లే..!

Read more RELATED
Recommended to you

Latest news