తెలంగాణను శ్రీలంకలా ఊహించుకుంటున్నాడు -కేసీఆర్‌ పై బండి సంజయ్‌ సీరియస్‌

-

బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు కాపాడాల్సిన సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటని మండిపడ్డారు. మేధావులు జనాలు ఈ నిర్బంధాలు గమనించాలని కోరారు. అందరూ తెలంగాణను శ్రీలంక లా ఊహించు కుంటున్నాడని ఆగ్రహించారు బండి సంజయ్.

ఆ మూర్ఖుడు మునావర్ ఫారూఖ్ ఆహ్వానించే విషయంలో కేసీఆర్ కొడుకు పాత్ర ఉంది.. పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని నిప్పులు చెరిగారు. Mim మత విద్వేషాలు రెచ్చ గొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని పేర్కొన్నారు బండి సంజయ్. అన్ని మతాలు బాగుండాలని బీజేపీ చెప్పే విషయాలు ముస్లింలు కూడా ఆలోచిస్తు న్నారన్నారు. టి ఆర్ యస్, ఎమ్ఐఎం పార్టీలు కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్ చేస్తున్నాయని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news