Breaking: బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ రాజీనామా!

-

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని జాన్సన్ పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ కొన్ని రోజుల క్రితం సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్, రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాక్ ఇలా అందరూ రాజీనామా చేయడంతో జాన్సన్ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.

దీంతో ఆయన నేడు( గురువారం) తన రాజీనామా ని ప్రకటించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు గాను ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రీస్ పించర్ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. ఇటీవల ఒక క్లబ్ లో తాగిన మత్తులో క్లిష్ పించర్ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

అయితే అతను ఇలాంటి వాడు అని తనకు తెలియదని ప్రధాని బోరిస్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో బోరిస్ పై తమకు విశ్వాసం లేదని మంత్రులు పదవులు నుంచి తప్పుకోవడంతో పాటు ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్ చేశారు. దీంతో నేడు ఆయన రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news