BREAKING: డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్.. 13 రౌండ్లో కుడా టిఆర్ఎస్ ఆదిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ 13వ రౌండ్ ముగిసింది. మునుగోడు నియోజకవర్గం ప్రజల తీర్పు ఏంటో దాదాపుగా తెలిసిపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మునుగోడు ఓటర్లు జై కొట్టారు. టిఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే బిజెపి కూడా టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. 13 రౌండ్ లోను టిఆర్ఎస్ పార్టీ ఆదిత్యత సాధించింది.

మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోను టిఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఇక 13 రౌండ్ లోను టిఆర్ఎస్ 9039 ఓట్ల మెజారిటీతో దూకుడు కొనసాగిస్తుంది. బిజెపి గ్రాఫ్ రౌండ్ రౌండ్ కు పడిపోయింది. మొత్తం 15 రౌండ్లు ఉండగా 13 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే టిఆర్ఎస్ గెలుపు ఖాయం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version