ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయోస్ శుక్రవారం సురేన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల విడుదలతో ఈ క్షణం నుంచే హేమంత్ సూరన్ సభ్యత్వం రద్దయిపోయింది. ఈసీ సిఫారసు మేరకు గవర్నర్ హేమంత్ సభ్యత్వాన్ని రద్దు చేయగా.. తనకు తానే బొగ్గు గని కేటాయించుకున్నారని సీఎం పై ఆరోపణలు ఉన్నాయి.
అయితే దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించకుండా సుప్రీంకోర్టు నుంచి సోరెన్ స్టే తెచ్చుకున్నారు. సొరెన్ శాసనసభ సభ్యత్వం రద్దుతో సీఎంతో పాటు మంత్రులు పదవులు కోల్పోయారు. షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారీగా అస్తులు సంపాదించినట్లు సొరెన్ కుటుంబం పై ఇప్పటికేే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
చట్ట సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్టులు పొందరాదని.. దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గవర్నర్ ఈసీ అభిప్రాయాన్ని కోరగా.. ఈసీ తన స్పందన తెలియజేసింది. దీంతో గవర్నర్, సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు.