BREAKING: ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేలకు భద్రత పెంచిన తెలంగాణ ప్రభుత్వం

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించగా.. తాజాగా గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్, మరియు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 7 కు వాయిదా వేసింది. నిందితులకు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగింది.ఈ కేసులో విచారణను హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు దర్యాప్తుపై స్టే కొనసాగుతుందని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news