బ్రేకింగ్; ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వార్ ఎప్పటి నుంచి అంటే…!

-

ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు చేసారు. ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం. 20, 21, 22 తేదీల్లో అంటే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 20వ తేదీన బీఏసీ సమావేశంలో షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటుగా మూడు రాజధానులు అంటూ చెప్పిన జీఎన్‌రావు కమిటి గురించి ఆ తర్వాత ఏర్పాటు చేసిన బీసీజీ ఇచ్చిన నివేదిక గురించి త్వరలో రాబోయే హైపవర్‌ కమిటీ నివేదికలపై సభలో చర్చించనున్నారు. రాజధాని తరలింపుపై తీర్మానం అసెంబ్లీ చేయనున్నారు. 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నుంచి మెసేజ్ లు పంపించారు.

ఇక ఈ సమావేశాల్లో రాజధాని మార్పుపై కీలక నిర్ణయం ప్రభుత్వం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎలాగూ కమిటీలు చెప్పాయి కాబట్టి రాజధాని మార్పు తధ్యం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక దీనిపై విపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఈ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news