ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి యువ మంత్రం బయటకు వచ్చింది. నిజాని కి గత ఏడాది ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పినా.. ఆయన చివరి నిముషంలో మాత్రం ఏదో అడపా దడపా టికె ట్లు ఇచ్చి సరిపెట్టారు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా పార్టీలో టికెట్ల కోసం వేచి ఉన్న యువతకు పెద్ద గా ప్రాధాన్యం లభించలేదు. దీనికితోడు యువత కూడా తమకు ప్రాధాన్యం లేనప్పుడు ఎందుకు పనిచేయాలని అనుకున్నా రో ఏమో.. ఎన్నికల్లో పవన్‌కు కలిసిరాలేదు. దీంతో ఆయన ఘోరంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఆ తర్వాత జిల్లా స్థాయి పదవుల్లో కొంత మేరకు యువతకు ప్రాధాన్యం పెంచారు. అయితే, వారికి పని మాత్రం అప్పగించలేదు. ఇదిలావుంటే, త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోయిన ప్రాభవా న్ని ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అయినా ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయం జనసేనాని పవన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గ తంలోనూ ఇటీవల కూడా ఆయన ఇదే అభిప్రాయం వెల్లడించారు. స్థానికంలో అయినా సత్తా చాటాలని ఆయన యువతకు పిలుపునిస్తున్నారు. మీరు సరిగా ఉంటే.. మనం గెలిచేవారం.. అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
అరుపులు, కేకలతో హడావుడి చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని చెప్పిన పవన్.. యువతకు దిశానిర్దేశం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిం చారు. అయితే, ఇప్పటి వరకు యువత ఆదిశగా ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అనుభవం ఉన్న వారితో పాటు యువతరానికీ పెద్ద పీట వేస్తామని స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై పవన్ చర్చించారు. ఏళ్ల తరబడి నిస్వార్థంగా పార్టీ జెండా మోసిన యువతకు 50 శాతం టికెట్లు ఇచ్చి నిలబెడతామన్నారు. తెగింపు లేకపోతే ముందుకు వెళ్లలేమన్న ఆయన… కొత్త రక్తం రాక పోతే రాజకీయాల్లో మార్పు రాదని స్పష్టం చేశారు.
పార్టీ సంస్థాగత నిర్మాణానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెదిరింపులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ తరఫున హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని, లీగల్ టీమ్ అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. అయితే, పవన్ ప్రయత్నం ఇప్పటికైనా ఫలిస్తుందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.