Breaking: WWE సూపర్‌స్టార్ జెఫ్ హార్డీ అరెస్ట్

-

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జెఫ్ హార్డీ అరెస్ట్ అయ్యారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో పోలీసులు జెఫ్ హార్డీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రద్దు చేసిన లైసెన్స్ తో డ్రైవింగ్ చేశాడని, డ్రైవింగ్ లైసెన్స్ పై విధించిన పరిమితులను ఉల్లంఘించినట్లు హార్డీపై అభియోగాలు మోపారు. అయితే హార్డీపై 10 ఏళ్లలో మూడోసారి ఇలాంటి కేసులో చిక్కుకున్నాడు.

 జెఫ్ హార్డీ
జెఫ్ హార్డీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వోలుసియా కౌంటీలోని ఐ-95లో డ్రైవర్‌పై పోలీసులకు అనేక కాల్స్ వచ్చాయి. హైవేపై డ్రైవింగ్ నమూనాలు సరిగ్గా లేదని ఆరోపిస్తూ.. హార్డీ వాహనాన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపారు. హార్డీ రోడ్డుపై అటుఇటుగా కారును నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కాళ్లపై కూడా తానూ సరిగ్గా నిలబడే పరిస్థితిలో లేడని, అతడి నోటి నుంచి మద్యం వాసన వచ్చిందన్నారు. అందుకే అతడిని కస్టడీలో తీసుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news