ఇదేం విడ్డూరం రా బాబూ.. 28మంది భార్యల ముందు 37వ పెళ్ళి చేసుకున్న వృద్ధుడు..

-

చిన్నప్పుడు కథల్లో చదువుకునేవాళ్ళం. రాజులకి చాలామంది భార్యలు ఉండేవారని. అలాంటి పరిస్థితులు ఇప్పుడూ ఊహించగలమా? కానీ, తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అప్పటి కాలం పరిస్థితులు నిజమే అయ్యుండవచ్చన్న భావన కలుగుతుంది. ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఒకానొక వీడియోలో, పండు వయసులో ఉన్న ఒక వృద్ధుడు, 28మంది భార్యలు, 135మంది పిల్లలు, 126మంది మనవలు, మనవరాళ్ల ముందు 37వ పెళ్ళి చేసుకున్నాడు.

ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ వీడీయో ఐపీఎస్ ఆఫీసర్ రుపీన్ శర్మ పోస్ట్ చేసారు. ఇంకా, ఈ వృద్ధుడిని ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతుడని అన్నారు. ఈ వీడియో ఎవరు తీసారనేది, ఎలా బయటకి వచ్చిందనేది తెలియదు. కాకపోతే ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సింగిల్స్ ఈ పెళ్ళి చూసారంటే సూసైడ్ చేసుకుంటారని ఒకరు, ఒక్కరినే సంభాళించడం కష్టమవుతున్న ఈ రోజుల్లో 37వ పెళ్ళి చేసుకోవడం చాలా గొప్పే అని మరొకరు కామెంట్లు చేసారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తైవాన్ కి చెందిన ఒక వ్యక్తి, 37రోజుల వ్యవధిలో ఒకే అమ్మాయిని నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆఫీసులో సెలవు కావడం విశేషం.

ఇంకా, తైపైకి చెందిన ఒక బ్యాంకు క్లర్క్, సెలవు తీసుకుని పెళ్ళి చేసుకున్న 16రోజులకు (సెలవులు ముగిసిపోయిన తర్వాత) విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత అదే అమ్మాయిని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయంలో అతనికి శిక్ష పడింది.

Read more RELATED
Recommended to you

Latest news