ఏపీలో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు నడుస్తోంది..అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో రచ్చ నడిచిన సంగతి తెలిసిందే..దాదాపు చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు జరిగింది..దీని వల్ల టీడీపీకి గట్టిగానే డ్యామేజ్ జరిగింది..2019 ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి వర్గ పోరు కూడా ఒక కారణమే. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా టీడీపీలో రచ్చ ఆగడం లేదు. ఇప్పటికే నేతల మధ్య రగడ నడుస్తోంది.
ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది. అక్కడ సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు వర్గాల మధ్య పోరు ఉందని తెలుస్తోంది. ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో అశోక్ గజపతికి పట్టు ఎక్కువ…మొదట నుంచి ఆయన ఎక్కువగా ఉండేది. అయితే నిదానంగా ఆయన హవాని తగ్గించేందుకు..కళావెంకట్రావు, గంటాలు బాగానే ప్రయత్నించారు.
అధికారంలో ఉన్నప్పుడే సెపరేట్ గా గ్రూపులు నడిపారు..ఇప్పుడు కూడా అదే పరిస్తితి కొనసాగుతుంది…అశోక్ గజపతికి వ్యతిరేకంగా కిమిడి వర్గం పనిచేస్తుంది. ఆఖరికి అశోక్, కిమిడికి కూడా పడని పరిస్తితి. ఆ మధ్య చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే…ఆ పర్యటనలో పక్క పక్కనే ఉన్నా సరే…అశోక్,కిమిడి పలకరించుకోలేని పరిస్తితి. అంటే ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వీరి వల్ల బలంగా ఉన్న నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంచార్జ్ లు లేకుండా పోయారు. ఈ పోరు వల్ల అక్కడ ఇంకా ఇంచార్జ్ లని పెట్టలేదు. అయితే ఇలాగే తమ్ముళ్ళ పోరు కొనసాగితే మళ్ళీ విజయనగరంలో వైసీపీనే పైచేయి సాధిస్తుంది. గత ఎన్నికల్లో ఎలాగో క్లీన్ స్వీప్ చేసేసింది….వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అలెర్ట్ గా ఉండకపోతే…మళ్ళీ విజయనగరంలో వైసీపీదే పైచేయి అవుతుంది.