బిఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ తోట పవన్ ను ఈరోజు పరామర్శించారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పవన్ పై బీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నీతులు చెప్పే కేసిఆర్.. ముందు ఆ పార్టీ శ్రేణులకు ప్రజాస్వామ్య పాటలు నేర్పాలని సూచించారు.
అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికే ఉందా? అని ప్రశ్నించారు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న వారిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పవన్ ముఖాన్ని గుర్తుపట్టకుండా దాడి చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.