సంజన, సుకన్యతో ఫోన్లు ఆపి శాఖపై దృష్టి పెట్టు.. అంబటిపై బుద్దా వెంకన్న సెటైర్లు..

-

వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మొన్నటి వరకు టీడీపీ సీనియర్‌ నాయకులు అయ్యన్న పాత్రుడు మంత్రి అంబటి రాంబాబును టార్గెట్‌ చేస్తూ.. ట్విట్టర్‌ వేదిక వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే తాజాగా.. మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుర్ర తక్కువ అంబటీ… శాఖపై విషయజ్ఞానం పెంచుకో అంటూ హితవు పలికారు బుద్ధా వెంకన్న. జగన్ రెడ్డి ధనయజ్ఞం వల్లనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు బుద్ధా వెంకన్న.

Ambati Rambabuకు బుద్ధా వెంకన్న కౌంటర్‌ - Andhrajyothy

పైసల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ కు వెళుతుంటే కేంద్రం వద్దని మొత్తుకుందని, ప్రాజెక్ట్ దెబ్బతింటుందని హెచ్చరించినా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, తక్కువ రేటుకే ప్రాజెక్టు నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తిచేస్తామని రాతపూర్వకంగా తెలిపిందని వివరించారు బుద్ధా వెంకన్న. పోలవరం హెడ్ వర్క్స్ పూర్తి చేసేందుకు రూ.1,771 కోట్లు అవసరమైతే, రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,548 కోట్లకే 24 నెలల్లోనే పనులు పూర్తిచేస్తామని, రూ.223 కోట్ల ప్రజాధనం మిగిలిపోయిందని హడావుడి చేశారని ఆరోపించారు బుద్ధా వెంకన్న. ఆఖరికి ఇప్పుడు ఆ వ్యయం రూ.1,917 కోట్లకు పెరిగిపోయిందని బుద్ధా వెల్లడించారు. అంచనా కంటే రూ.146 కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృథా అయిందని విమర్శించారు బుద్ధా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news