ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ నోట.. మహాత్మాగాంధీ మాట..

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టి 100 రోజులు దాటింది. అయితే.. రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు కూడా అంతేరీతిలో ప్రతిఘటిస్తున్నాయి. అయితే.. తాజాగా ఉక్రెయిన్ లో భారత రాయబారిగా నియమితులైన హర్షకుమార్ జైన్ లాంఛనాలను పూర్తి చేసే కార్యక్రమంలో జెలెన్ స్కీ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు జెలెన్‌ స్కీ.

President Zelensky says on eve of invasion one hundredth day that Russia  now controls 20% of Ukraine - Esajaelina

ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ.. “భయం తొలగిపోయినప్పుడే బలం కలుగుతుంది. బలం అనేది మన శరీరంలో కండరాల సంఖ్యపై ఆధారపడి ఉండదు. వారు మొదట నిన్ను విస్మరిస్తారు, ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, అనంతరం నీతో పోట్లాడతారు, ఆపై నువ్వు విజయం సాధిస్తావు” అంటూ నాడు మహాత్ముడు ప్రవచించిన మాటలను జెలెన్ స్కీ పలికారు. భారత రాయబారి అందించిన అధికారిక చిహ్నాలను, పత్రాలను స్వీకరించారు. ఇదే విధంగా అమెరికా, మాల్డోవా రాయబారులు అందించిన చిహ్నాలు, పత్రాలను స్వీకరించారు. తమ దేశంలో ఉండిపోయేందుకు మళ్లీ వచ్చిన విదేశీ రాయబారులను అభినందిస్తున్నానని జెలెన్ స్కీ తెలిపారు. మిగిలిన దేశాల రాయబారులు కూడా త్వరలోనే కీవ్ కు వస్తారని ఆశిస్తున్నట్టు వివరించారు జెలెన్‌ స్కీ.

Read more RELATED
Recommended to you

Latest news