అంబటి లేఖకు బుద్దా వెంకన్న కౌంటర్ లెటర్

-

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య లేఖల వార్‌ నడుస్తోంది. ఇవాళ చంద్రబాబు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాయగా.. ఆయన లేఖకు కౌంటర్‌గా మంత్రి అంబటి లేఖను సంధించారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు లేఖకు కౌంటర్‌ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ లెటర్ రాశారు. లేఖలో బుద్దా.. మంత్రి అంబటిది నీటి పారుదల శాఖ కాదు.. మురికి నోటి పారుదల శాఖ. నిత్య‌మూ మీరు ప‌త్తేపారాలు న‌డిపే అంబటి సంజన, సుకన్యలకి లేఖ ఎందుకు రాయలేదు? అరగంటలో ఏమేమి చేస్తారంటూ లేఖాస్త్రం ఎందుకు వదలలేదు? పిచ్చి జగన్ బ్రాండ్ ప‌చ్చి మందు కాకుండా దుబాయ్ లో మ‌ద్యం ఎందుకు కొన్నారు? దుబాయ్ కు ఏ క‌న్య‌తో వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే టెక్నిక‌ల్‌ డీటెయిల్స్ లోకి పోకుండా మీకు ప్రేమతో ప్రతి లేఖ రాస్తున్నాను.

Buddha Venkanna: No photo on flexi: Ex-MLC Buddha Venkanna abruptly..

నువ్వు లెట‌ర్ రాసి రాంగ్ అడ్ర‌స్‌కి పోస్టు చేశావు. నువ్వు రాయాల్సిన లేఖ‌లు కృష్ణా జలాలు హ‌క్కులు వ‌దులుకున్న మీ పిచ్చి జ‌గ‌న్ కి, రాష్ట్ర హక్కుల కోసం కేంద్రానికి లేఖ రాయాలి. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు ఆమోదించమని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రికి లేఖ రాయాలి. ఇరిగేషన్ మంత్రిగా పిల్ల కాలువ తవ్వలేని నువ్వు, సాగునీరు ఇవ్వలేని నువ్వు రైతన్నలకు క్షమాపణ చెపుతూ లేఖ రాయాలి. కాపు జాతిపై నోటి దూలతో నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు క్ష‌మించ‌మ‌ని కోరుతూ కాపుల‌కి లేఖ రాయాలి. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ది పని చేయలేక‌పోయినందుకు గెలిపించిన ప్రజలకు సారీ చెపుతూ లేఖ రాయాలి. పారిశుధ్య కార్మికుడు చ‌నిపోతే వచ్చిన CM సహాయ నిధిలో వాటా అడిగి, వారు ఇవ్వ‌క‌పోవ‌డంతో చెక్కు వెన‌క్కి తీసుకున్నందుకు సిగ్గుప‌డుతూ మ‌న్నించ‌మ‌ని వేడుకుంటూ లేఖ రాయాలి.

నీటిపారుద‌ల‌శాఖా మంత్రిగా ఉంటూ ల‌స్క‌ర్లకి జీతాలు కూడా ఇవ్వ‌లేని నీ చేత‌గానిత‌నాన్ని ఒప్పుకుంటూ ఉత్త‌రం రాయాలి. పిచ్చి మందు తాగ‌లేక దుబాయ్ వెళ్లాల్సి వ‌చ్చింద‌ని.. నీ పిచ్చి జ‌గ‌న్ కి లేఖ రాయాలి.
బాబాయ్‌కి గొడ్డ‌లిపోటు వేసిన అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నీ పిచ్చి జ‌గ‌న్‌ని త‌ప్పు ఒప్పుకోమంటూ అంబటి లేఖ రాయాలి. మైడియ‌ర్ కాంబాబూ! నీ ఏజేంటి? నీ గేజేంటి? నువ్వు చేసే గ‌లీజు ప‌నులేంటి?
ఆ గ‌లీజు చేతుల‌తో లేఖ‌లు రాయ‌డం ఏంటి? ఓహో నువ్వు దుబాయ్‌లో ఉంటే, ఐప్యాక్ పేటీఎం బ్యాచులు ఈ లేఖ రాసేశాయా? అయ్యో రాంబాబు.. నీ దుస్థితికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేయ‌డం త‌ప్పా ఏం చేయ‌లేను. నేను రాసిన లేఖ చ‌దువుకుని స‌మాధానం పంపుతావ‌ని ఆశిస్తున్నాను.’ అంటూ బుద్దా వెంకన్న లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news