డైలాగ్ ఆఫ్ ద డే : రూపాయి పాపాయి

-

చిట్టి చేతులు రేప‌టిని న‌డిపిస్తాయి
చిన్న చిన్న ప‌నులు రేప‌టిని నిర్దేశిస్తాయి
రూపాయి పాపాయి అవును ఈ రెండూ ఒక్క‌టే
భ‌విష్య కాలంలో ఎదిగివ‌చ్చే తీరున‌కు ఇప్ప‌టి
పెట్టుబ‌డి ఇప్పటి న‌డ‌వ‌డి అన్న‌వి కీల‌కం

ఇవాళ బ‌డ్జెట్ డే రూపాయి లెక్క‌ల దినోత్స‌వం అని తెలుగులో రాసుకోవ‌చ్చు. ఏం కాదు కానీ ఆ లెక్క‌ల ఉండే వెనుక‌బాటుత‌నాన్ని మ‌నం నిలువ‌రించ‌గ‌లిగిన‌ప్పుడే వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి అన్న‌ది సాధ్యం.అన్ని వ‌ర్గాల స‌మున్న‌త అభివృద్ధి అన్న‌ది సాధ్యం. ఆ విధంగా ఇవాళ తెలుగింటి కోడలు ఏ విధంగా క‌రుణించ‌గ‌ల‌రో చూడాలి. ఏ విధంగా ఆదుకుని సహాయ ప‌డ‌గ‌ల‌రో కూడా అంచ‌నా వేయ‌గ‌ల‌గాలి.

మ‌నిషికి మ‌నిషి మ‌ధ్య ఇంతటి ప్రేమ ఇంత‌టి విశ్వాసం మ‌రియు న‌మ్మ‌కం వీటికి క‌లిపి ఉన్న ఓ ట్యాగ్ లైన్ మ‌నీ. ఇవాళ్టి ట్రోల్ వ‌ర్డ్ కూడా అదేనండి! బ‌డ్జెట్ అంటే ఏంటి ఏం లేదు నిర్మ‌ల‌మ్మ పోపుల డ‌బ్బా! అందులో ఆమె దాచుకున్న‌ది ఎంత..ఖ‌ర్చు చేసి మిగిల్చి ఆదుకున్న‌దెంత‌? ఇవేవీ కాకుండా అప్పుల రూపంలో పోయిందెంత..ప‌న్నుల రూపేణా వ‌చ్చిందెంత? అయినా మ‌న ప్ర‌ధాని విదేశీ పెట్టుబ‌డుల‌ను వ‌ద్ద‌నుకుంటున్నాడు.అదేవిధంగా ఇంకొన్నింటిని కూడా వ‌ద్ద‌నుకుంటున్నాడు. ఆ మాట‌కు వ‌స్తే తెలుగు రాష్ట్రాలు కూడా అదే ప‌నిలో ఉన్నాయి.

ఆంధ్రా క‌న్నాతెలంగాణ కాస్త బెట‌ర్. తెలంగాణ అన్న రాష్ట్రం త‌నని తాను జాతీయ వృద్ధి రేటుతో పోల్చుకుంటుంది. ఆ ప‌నిలో వేగం పెంచుతూ పోతుంటుంది. ఆంధ్ర ప్ర‌భుత్వం కేవ‌లం త‌న‌కి తాను ప‌రిమితం అయి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే దేశంతో పోటీ పడే రాష్ట్రాలో సంబంధిత ప్ర‌భుత్వాల్లో దేశంలో చాలా ఉన్నాయి. ఆ పాటి పోటీ ఇవ్వ‌కుంటే డ‌బ్బున్న కార‌ణంగా బీజేపీ మిగ‌తా ప్రాంతీయ పార్టీల‌ను బ‌త‌క‌నివ్వ‌దు. నాలుగు వేల‌కోట్ల‌కు పైగా ఆస్తులున్న బీజేపీ ఎక్క‌డ ? 300 కోట్ల రూపాయ‌ల ఆస్తులున్న టీఆర్ఎస్ ఎక్క‌డ? అయినా ఈ సంప‌ద అన్న‌ది ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్తుంది అన్న‌ది డౌట్.ఆ విధంగా ప్రాంతం నుంచి ప్రాంతం వ‌ర‌కూ డ‌బ్బు ఏ రూపాన మారుతుంది దేశం నుంచి దేశం వ‌ర‌కూ డ‌బ్బు ఏ విధంగా త‌ర‌లి పోతుంది అన్న‌దే ఇవాళ ముఖ్యం.

సంప‌ద‌ను ఏ విధంగా తూచాలి. సంప‌ద‌ను ఏ విధంగా అంచ‌నా వేయాలి.రానున్న సంప‌ద దృష్ట్యా ఏ విధంగా బ‌త‌కాలి..రానున్న స‌వాళ్ల దృష్ట్యా ఏ విధంగా న‌డుచుకోవాలి ఇవ‌న్నీ బ‌డ్జెట్ చెబుతుంది. మ‌నం నేర్చుకోవాలి లేదా నేర్పేరీతిలో ఆర్థిక శాఖ సంబంధిత ప‌రిభాష‌ను సులువుత‌రం చేయాలి.వ‌స్తున్న డ‌బ్బుకూ పోతున్న సొమ్ముకూ మ‌ధ్య అంత‌రం ఎక్కువ‌యితే ఓ దేశం సంబంధిత ప్ర‌జ‌లు కుదేల‌యిపోవ‌డం ఖాయం. క‌నుక సంప‌ద సృష్టి మ‌రియు వెచ్చింపు అన్న‌వి ఎంతో ముఖ్యం.

వాస్త‌వానికి న‌గ‌రాలే సంప‌ద సృష్గి కేంద్రాలు అన్న అపోహ ఉంది కానీ గ్రామీణ భార‌తావ‌ని ఎంత ప‌టిష్టంగా ఉంటే అంత వేగంగా దేశం పురోగ‌తి సాధ్యం. ఆ విధంగా సంప‌ద‌ను పెంచుకోవ‌డంలో చూపాల్సిన శ్ర‌ద్ధ పాల‌కులు చేయాలి. నియంత్రిత వ్య‌వ‌స్థ ఉంటూనే ఖ‌ర్చువిష‌య‌మై స్ప‌ష్ట‌మ‌యిన వివ‌రం ఒక‌టి పాల‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తూ ఉండాలి. ఆ విధంగా దేశాన్ని పాలించే శ‌క్తులు రూపాయి లెక్క‌ల‌పై జాగురుక‌త వ‌హించాలి.వ్య‌వ‌హ‌రించాలి. కాలంలో వ‌చ్చే వేగంతో పాటు ఖ‌ర్చు అన్న‌వి ఏ నిష్ప‌త్తిలో ఉన్న‌వి అన్న‌వి కూడా అంచ‌నా వేయ‌గ‌లగాలి.వ‌స్తున్న స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తూ చేసే ప్ర‌తి ప‌ని రేప‌టి పురోగ‌తికి మేలు చేస్తే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news