అసద్ పై అసమర్థ నాయకత్వాల దాడి కారణంగా ఎంఐఎం ఏమీ మారిపోదు.
తూటాల వర్షం కారణంగా ఎంఐఎం ఆత్మ నిబ్బరం చెడిపోదు కానీ
ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే జరుగుతాయి అని ఇప్పుడే
ఓ న్యూస్ ఎడిటర్ చెప్పారు.. ఎఫ్బీ వేదికగా…కనుక ఎంఐఎంపై దాడి ప్రజాస్వామ్యం పై దాడి కాదు అది కేవలం వ్యక్తిగత దాడి రాజకీయ దాడి కూడా కావొచ్చు.. ఒకరి ఎదుగుదలకు మరొకరు దగ్గరుండి కడుతున్న ఘోరీ!
ఇదీ ఇవాళ్టి డిస్కషన్ పాయింట్.. ఏం లేదు కాస్త తీరిగ్గా ఆలోచిస్తే ఫలితాలు వచ్చేనాటికి ఎంఐఎం ఆ గాలి పతంగం ఎటువైపు వెళ్లిందో తేలిపోతుంది లేండి..అందాక వెయిట్ అండ్ సీ భయ్యా!
వివాదస్పద సందర్భం ఇవాళ ఈ సాయంత్రం (బుధవారం సాయంత్రం) చోటు చేసుకుంది. రౌడీలు రాజ్యం ఏలే ఉత్తర ప్రదేశ్ నేలల్లో మన తెలంగాణ నేత కాన్వాయ్ పై తూటాల వర్షం..ఎంఐఎం నేతపై దాడి అసద్ పై దాడి..తప్పుకున్నాడు మనోడు.అయితే మాత్రం ఈ దాడిని అంతగా పట్టించుకోకుండా ఉండలేం. ఉండేందుకు ఛాన్సే లేదు.ఇప్పటిదాకా కేసీఆర్ కు ఫ్రెండుగా ఎంఐఎం రానున్న ఎన్నికల్లో ఎవరికి ఫ్రెండు కావాలనుకుంటున్నది? బీజేపీ ఓట్లను చీలుస్తుందా అన్నది ఓ పాయింట్ .. ఎస్పీ ఓటింగ్ ను చీలుస్తుందా? ఈ రెండింటిపై సోషల్ మీడియా పెద్ద రచ్చే జరుగుతుంది.
ప్రజాస్వామ్య దేశాల్లో అడుగడుగున్నా అవరోధాలు ఉంటాయి. అభిశంసన ఉంటుంది. అధికార దాహం కూడా ఉంటుంది. కూడా అంటే కూడా తోడై ఉంటుంది అని! ఇందుకు ఎంఐఎం అస్సలు మినహాయింపు కాదు.ఇందుకు బీజేపీనో,ఎస్పీనో అంతకన్నా మినహాయింపు కాదు. అందుకే రాజ్యంలో తూటాల లెక్కలు అంతగా కొన్నిసార్లు తెలియవు.ఈ దాడి ఎవరు చేయించి ఉంటారు. బీజేపీ నాయకులా లేదా ఎస్పీనాయకులా అన్నది ఇప్పుడొక చిక్కు ప్రశ్న.
తూటాలే మాట్లాడతాయా అన్న మాట ఒకటి వినిపిస్తుంది.విసిగిస్తుంది.ఉత్తర ప్రదేశ్ లో తూటాలు బాగానే పేలాయి.మామూలుగా కాదు మూడు నుంచి నాలుగు రౌండ్ల వరకూ పేలాయి.కేవలం హత్యాయత్నంలో భాగంగానే ఇవి పేలాయి అని అంటున్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై తూటాలు పేలాయి అన్న వార్త మీడియాలో తిప్పి తిప్పి చూపుతున్నారు. మీరట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుండగా పేలిన తూటాలు రాజకీయంగా ఎవరికి ప్రయోజనమో? ఎవరి కడపు నింపి కొత్త ప్రయోజనం ఒకటి తీసుకువస్తుందో అన్నది చూడాలిక.
– డిస్కషన్ పాయింట్, మన లోకం ప్రత్యేకం