గాయం కారణంగా ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కు మరియు ఇతర కీలకమైన సిరీస్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరు లోని NCA వేదికగా ఫిట్నెస్ ను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. అయితే బీసీసీఐ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా త్వరలోనే ఇండియా తరపున మ్యాచ్ ఆడనున్నాడట. ఇది ఇండియా అభిమానులు సంతోషపడే విషయమని చెప్పాలి. నిన్ననే వెస్ట్ ఇండీస్ తో జరగనున్న టెస్ట్ మరియు వన్ డే లకు టీం ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులోనూ బుమ్రాకు చోటు దక్కలేదు. ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తో జరగనున్న సిరీస్ కు బుమ్రా అందుబాటులోకి రానున్నదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మరి చూద్దాం .. గాయం తర్వాత బుమ్రా అదే ఫామ్ ను చూపిస్తాడా ?