ప్రతీ భారతీయుడి గుండెను హత్తుకునే ‘మేజర్’..శేష్ సినిమాపై బన్నీ ప్రశంసల వర్షం

-

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.

మేజర్ సినిమా ప్రతీ భారతీయుడి గుండెను హత్తుకుంటుందని,మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడని అన్నాడు. కథలో కీలక పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ అందించారన్నారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారని, శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయిందని పేర్కొన్నారు.

ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత సూపర్ స్టార్ మహేశ్‌ బాబుకు థాంక్స్ చెప్పాడు. ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గతేడాది విడుదలైన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విలన్ గా మాలీవుడ్ (మలయాళ) స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించగా, హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news