బిజినెస్ ఐడియా: ఈ వ్యాపారం చేస్తే నెలకి యాభై వేలు సంపాదించచ్చు…!

-

చాలా మంది వ్యాపారాలని చేయడానికి చూస్తున్నారు. నచ్చిన వ్యాపారం చేసి మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడాల్సిందే. ఈ బిజినెస్ ఐడియానే కనుక అనుసరిస్తే నెలకి 50 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. మరి ఇక ఆ బిజినెస్ ఐడియా గురించి చూద్దాం.

బిర్యానీ ఆకు ద్వారా మనం మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా మంది వంటకాలలో బిర్యాని ఆకుని ఉపయోగిస్తూ ఉంటారు. బిర్యానీ ఆకు సాగు చేసి మీరు చక్కటి లాభాలను పొందవచ్చు. ఇక ఈ బే ఆకు సాగు ఎలా ప్రారంభించాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు మంచి నాణ్యమైన మొక్కలని కొనుగోలు చేయాల్సి ఉంటుంది నాలుగు నుండి ఆరు మీటర్ల దూరంలో మొక్కలని నాటుతూ ఉండాలి.

తగినంత దూరం మధ్యలో ఉండాలి చూసుకోండి. అలానే క్రమం తప్పకుండా నీటిని వాటికి అందించాల్సి ఉంటుంది. మీరు ఈ సాగు తో పాటుగా మరొక సాగు కూడా వేస్తే మంచిది దానితో లాభాలు బాగుంటాయి. అయితే ఈ మొక్కలను సాగు చేయడానికి జాతీయ మొక్కల బోర్డు 30% వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ బోర్డుకి దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు సబ్సిడీని పొందొచ్చు. మీరు కనుక 25 బిర్యానీ ఆకు మొక్కల్ని నాటితే ప్రతి సంవత్సరం 75 వేల నుండి లక్ష 25 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అయితే మీరు మంచి నాణ్యమైన మొక్కలని ఎక్కువ మొక్కలని నాటితే 50 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news