ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ప్రారంభమైన తొలిరోజే తెలంగాణ కీలక విజయం సాధించింది. ఈ సదస్సు ద్వారా మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సీ ఫర్ ఐఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. స్విట్లర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది.
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందిస్తోన్న ఈ సంస్థ.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో విస్తరించింది. తాజాగా భారత్‌లో అడుగుపెడుతున్న ఈ సంస్థ తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరేమీ జర్గన్స్, తెలంగాణ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.