రోజు రాత్రి యాలకులను తిని వేడి నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చా..!

-

యాలకులను వంటల్లో చాలా తక్కువగా వాడతారు. కానీ వీటివల్ల ప్రయోజనం అమోఘం.. నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టే గుణం యాలకులకు ఉంది. ఇదొక్కటేనా..ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత ఒక యాలకను నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంటే.. అసలు గ్యాస్‌ ట్యాబ్లెట్‌ వాడక్కర్లేదు. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గుణం యాలకులకు ఉంది. అయితే రాత్రి నిద్రపోయే ముందు యాలకులను ఇలా వాడితే మానసిక ప్రశాంతత దక్కుతుందట.. ఇంకా ఏం ఏం లాభాలు ఉన్నాయంటే..
రాత్రి పూట యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతోపాటు చక్కటి నిద్ర పడుతుందట. దంత సమస్యలు కూడా తగ్గుతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట యాలకులను తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట, ఇన్‌ఫెక్షన్‌ వంటి తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు యాలకులను తీసుకోవడం మంచి ఫలితం ఉంటుంది. యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలోని వ్యర్ధ పదార్దాలు తొలగిపోతాయి. అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. యాలుకలతో తయారుచేసిన కషాయాన్ని నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
నరాల బలహీనత ఉన్నవారు యాలుకలు తిని గోరువెచ్చని నీటిని తీసుకుంటే నరాల బలహీనత తొలగిపోతుందట.. అంతేకాకుండా లైగింగ సామర్ధ్యం పెరుగుతుంది. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని రోజువారిగా తీసుకోవటం మంచిది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి.
ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇలా ఒకటేంటి యాలకుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.. ఉప్పు అందరి ఇంట్లో ఉంటుంది.. కానీ యాలకులు మాత్రం తెచ్చుకోరు..! పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు రోజు రాత్రి రెండు యాలకులను తిని వేడి నీళ్లు తాగి చూడండి. మార్పు మీరే గమనిస్తారు.!

Read more RELATED
Recommended to you

Latest news