ఫ్యాక్ట్ చెక్: హైడ్రోజెన్ పేరాక్సయిడ్ తో కరోనాని తగ్గించచ్చా..? నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయం నుండి కూడా ఎన్నో ఫేక్ వార్తలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే నిజంగా అది నిజమా లేదు అంటే ఫేక్ వార్తా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు సోషల్ మీడియాలో ఏం వచ్చింది అనేది చూస్తే…. కరోనా వచ్చిన వాళ్ళకి హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు సెలైన్ సొల్యూషన్ బాగా ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు సమస్య ఉండదని… వైరస్ కూడా మీ నుండి వెళ్లి పోతుంది అని ఈ సోషల్ మీడియా వార్తల్లో ఉంది.

అయితే నిజంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం వల్ల కరోనా తగ్గిపోతుందా..?, దీనిలో నిజమెంత అనేది చూస్తే… యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ కరోనాను తగ్గించటానికి ఉపయోగపడదు అని తెలుస్తోంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి.

ఇది చర్మంపై ఏమైనా దెబ్బలు, గాయాలు తగిలితే మానిపించడానికి సహాయం చేస్తుంది. కానీ కరోనాని తగ్గించడానికి ఇది ఏమాత్రం ఉపయోగ పడదు అని తెలుస్తోంది. అందుకని కరోనని తగ్గించుకోవడానికి ఈ పద్ధతుల్ని అస్సలు ఫాలో అవ్వద్దు అని విశ్వాస్ న్యూస్ చెప్పింది. కాబట్టి ఇటువంటి ఫేక్ పోస్ట్లతో జాగ్రత్తగా ఉండండి లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news