చనిపోయిన వాళ్ళ ఏటీఎం కార్డుతో డబ్బులు తీసుకోచ్చా..?

-

బ్యాంకులతో పని లేకుండా ఏటీఎం కార్డుని ఉపయోగించి డబ్బులని డ్రా చేస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఏటీఎం కార్డుతో ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేయవచ్చా…?, లేదా అనేది చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. తల్లిదండ్రుల మరణం తర్వాత బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా డబ్బు విత్‌డ్రా చేసి… ఆ తరువాత వారి మరణం గురించి బ్యాంకుకు తెలియజేయడం నేరం కిందకు వస్తుంది కదా అని చాలా మంది అనుకుంటారు.

 

అయితే అది నిజామా కాదా అనేది కూడా చూద్దాం. ఇక అసలు విషయం లోకి వస్తే.. చనిపోయిన వారి అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం అనేది బ్యాంకును, ఇతర చట్టపరమైన వారసులను మోసం చేయడం కిందకు వస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తు చెయ్యాలి.

అదే మరణించిన వారి అకౌంట్ నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేస్తే.. చనిపోయిన వారి ఎస్టేట్‌కు సంబంధించిన ప్రొబేట్ కి కానీ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రొబేట్ అనేది చనిపోయిన వ్యక్తి ఎస్టేట్ నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియ.

ఇందులో వారి డబ్బు, ఆస్తుల నిర్వహణ, వాటిని వారసత్వంగా పంపిణీ చేయడం వంటివన్నీ ఉంటాయి. అయితే చనిపోయిన వ్యక్తి వీలునామా రాస్తే వారి ఎస్టేట్ నిర్వహణకు ఎంచుకున్న వ్యక్తుల పేరును అది తెలుపుతుంది. ఒకవేళ కనుక చట్టపరమైన వారసుల మధ్య వివాదం తలెత్తితే అప్పుడు దీన్ని దావాగా చెయ్యచ్చు. ఇవ్వని పత్రాలు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, సీసీటీవీ ఫుటేజ్, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు ATM కార్డు ఎవరి వద్ద ఉంది అనే వివరాలతో క్రిమినల్ కంప్లైట్ ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version