ఇప్పుడున్న ఉరుకుపరుకుల జీవితంలో సరిగ్గా తినడానికి కూడా సమయం లేకుండా అయిపోతుంది. ఏ వ్యాధులు శరీరాన్ని ఆవహించాయో తెలుసుకునేంత టైం ఉండదు. ఆడవారికయితే మరీ కష్టంగా ఉంటుంది. అలాంటి ఆడవారిలో ప్రధానంగా కన్పించే సమస్య థైరాయిడ్. థైరాయిండ్ వుంటే కొన్ని లక్షణాలు కనబడటం మొదలవుతాయి. ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
థైరాయిండ్ లక్షణాలు:
చాలామంది థైరాయిడ్ ఉన్నట్టు కూడా గమనించలేరు. కానీ శరీరంలో థైరాయిడ్ సమస్య పెరిగిపోతుంటుంది. అందుకే థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించగలిగితే త్వరగా నియంత్రించుకోవచ్చు. మరి థైరాయిడ్ గుర్తించడం ఎలా, థైరాయిడ్ ఉంటే శరీరంలో ఏ విధమైన మార్పులు వుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా థైరాయిడ్ ప్రమాదంగా మారకముందే సరైనా చికిత్స తో నయం చేసుకోవచ్చు.
థైరాయిడ్ ఎలా గుర్తించాలి..లక్షణాలేంటి..?
థైరాయిడ్ సాధారణంగా రెండు రకాల లక్షణాలను కనబరుస్తుంది. కొంతమందిలో థైరాయిడ్ వుంటే ఉబకాయ సమస్య మొదలవుతుంది. ఇంకొంతమందిలో సన్నగా పీలగా అవుతుంటారు. ఇవి రెండురకాలుగా ప్రమాదకరమేనని వైద్యనిపుణునులు హెచ్చరిస్తుంటారు. ప్రస్తుత కాలంలో థైరాయిడ్ అనేది సర్వసధారణంగా మారింది . సాధారణంగా అయోడిన్ లోపంతో థైరాయిడ్ సమస్య వస్తుంటుంది. ఎక్కువగా మహిళల్లో ఋతుక్రమణ సమస్యలు ఎక్కువుగా మొదలవుతాయి. కొంతమంది కి ఈ సమస్య వుంటే పీరియడ్ వచ్చినా.. 10,15రోజులైనా స్రావం ఆగకుండా ఎక్కువుగా అవుతుంటుంది.లేదా రెండులేదా మూడు నెలలకోసారి పీరియడ్ వచ్చినా ఎక్కువ ఋతుస్త్రావం కనబడదు.ఈ పరిస్థితుల్లో మహిళలు బరువు పెరిగిపోతుంటారు. దాంతోపాటు శరీరాన్ని బలహీనంగా మార్చి , పలు వ్యాధులు సంక్రమింప చేస్తుంది
థైరాయిడ్‌ను ఎలా నియంత్రించడం..
థైరాయిడ్ ను తగ్గించడానికి ఆయుర్వేదంలో మంచి చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. రోజూ ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జుతో తులసి రసం కలిపి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను క్రమంగా తగ్గించుకోవచ్చు. అలాగే తులసీ రసం ను కాషాయంగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.అలాగే మన ఆహారంలో అరికలు, సాములు, రాగులు వంటి చిరుధాన్యాలను చేర్చుకోవడం వల్ల హార్మోనల్ సమస్యలు తగ్గి థైరాయిడ్ అదుపులోకి వస్తుంది.ముఖ్యంగా అధిక రక్తస్రావం గలవారు అరికలు , తక్కువ రక్తస్రావము గల వారు సాములు తినడం వల్ల తొందరగా థైరాయిడ్ కి చెక్ పెట్టొచ్చు.