పంజాబ్ రాష్ట్రం లోని కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయని.. “ఆప్”, అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ లతో పాటు, కొత్త రాజకీయ శక్తి రాబోతుందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే కెప్టెన్ అమరీందర్ సింగ్.. కొత్త పార్టీ పెట్టడానికే సిద్దమైనట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
అంతే కాదు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్న కెప్టెన్ అమరీందర్ సింగ్… బిజేపి లో కూడా చేరను… తాను చాలా స్పష్టంగా ఉన్నానని కుండ బద్దలు కొట్టారు. 52 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ లో ఉన్నానని.. తన అభిప్రాయం ఏమిటో కాంగ్రెస్ పార్టీ లో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. తన పట్ల అనుమానంతో, అపనమ్మకంతో వ్యవహరించారు… అవమానపరిచారు… తన వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పంజాబ్ లో కాంగ్రెసు పార్టీ బలహీన పడుతోందని… . రాష్ట్రంలో “ఆప్” కు ప్రజాదరణ పెరుగుతోందనేది వాస్తవమన్నారు. సిధ్దు ఒంటెత్తు పోకడ మనిషి… ఒంటరి మనిషి… జట్టు నాయకుడు గా వ్యవహరించ లేరని ఫైర్ అయ్యారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్.