అత్యాచార బాధితురాలికి అండగా ఉంటాం – ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ లో అత్యాచార ఘటన రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో నలుగురు మ్రుగాళ్ల చేతిలో యువతి అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. మద్యం తాగించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువకులు సామూహిక అత్యాచారానికి గురైంది. తాజాగా పోలీసులు నిందితులందరిని అరెస్ట్ చేశారు.  అత్యాచారానికి గురైన యువతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యువతికి వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటన బాధాకరమని, రాష్ట్ర

అత్యాచారం

ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఉపేక్షించదని, మహిళల రక్షణ కోసంమే కేసీఆర్ ప్రతీ జిల్లాలో షీటీం లను ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నిందితులను 24 గంటల్లో పట్టుకున్నందుకు పోలీసులకు అభినందలు తెలియజేశారు.  నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ కేసులను పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పెంచుతామని సీపీ వెల్లడించారు.