అల్లు అర్జున్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..ఎందుకంటే?

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో తన టైటిల్ కూడా బన్నీ మార్చుకున్నాడు. ‘ఐకాన్ స్టార్’గా ఫుల్ ఫేమస్ అయిపోవడమే కాదు తన క్రేజ్ ను ఇంకా పెంచుకున్నాడు. కాగా, తాజాగా ఆయనపై హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

అల్లు అర్జున్ ఓ వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున వాణిజ్య ప్రకటనలూ చేస్తుంటారు. అలా ప్రకటనల ద్వారా రూపాయలు కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. కాగా, ఇటీవల బన్నీ చేసిన యాడ్ ఒకటి వివాదాస్పదమైంది.

శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం బన్నీ చేసిన యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి విమర్శించారు. సదరు యాడ్ లో నటించిన బన్నీ, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఉపేందర్ రెడ్డి హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news