టిక్కెట్టు లేని ప్రయాణం.. రైల్వేకు కాసులే కాసులు !

-

కొన్ని చోట్ల ద‌క్షిణాది క‌న్నా ఉత్త‌రాదిలో టికెట్ లేని ప్ర‌యాణాలే చాలా ఎక్కువ. అక్క‌డ దాడులుంటాయి. బెదిరింపులు ఉంటాయి. ఇంకాచెప్పాలంటే బీహార్ క‌ల్చ‌ర్ కు భ‌య‌ప‌డిన రైల్వే ఉద్యోగులు ఇప్ప‌టికీ ఉన్నారు. క‌నుక బీహార్ కానీ ఇంకా ఆ కోవ‌లో ఉండే ఒడిశా కానీ టికెట్ లేని ప్ర‌యాణాల‌కు అవి కేరాఫ్. అయితే వీటి సంగ‌తి ఎలా ఉన్నా ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించి మాత్రం రైల్వే కొన్ని అనూహ్య ఫ‌లితాలే అందుకుంది.

అదే స్పీడుతో బీహారు టికెట్ లేకుండా నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ప్ర‌యాణించే దొంగ‌ల‌ను, స‌ర‌కు ర‌వాణా చేసే దొంగ‌ల‌ను హాయిగా ప‌ట్టుకుని మీ పుణ్యం క‌ట్టుకోండి బాబు. అదేవిధంగా ఆ ఒడిశాలో కూడా ! ఈ రెండూ ఓ సారి మీరు ప‌ట్టించుకుంటే మీకు ఏడాదికి వంద కోట్లు పైగా అప‌రాధ రుసుములే వ‌స్తాయి. అన్నీ బాగున్నాయి కానీ మ‌న రైలు నిల‌యాల్లో ఉన్న వ‌స‌తులు అన్నీ బాగున్నాయనే అనుకోవాలా లేకా.. అవి కూడా మ‌న ద‌రిద్రంలో భాగం అని స‌ర్దుకుపోవాలా ?

The Northeast Frontier Railway (abbreviated NFR), is one of the 18 railway zones of the Indian Railways.
ఇది ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధించిన ఓ ప్ర‌త్యేక రైల్వే విభాగం. మ‌న దేశంలో రైల్వే కోర్టులు కానీ రైల్వే కేసులు కానీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కారం కావు. ఎందుకంటే అవి కొన్ని కార‌ణాల రీత్యా తాత్సారం అవుతూ ఉంటాయి. అందుకే వీలున్నంత మేర‌కు జ‌రిమానాల‌తోనే స‌రిపెట్టి ప్ర‌యాణికుల‌ను మంద‌లించి పంపుతారు. అయినా రెగ్యుల‌ర్ కోర్టుల‌కూ, రైల్వే కోర్టుల‌కూ ఎంతో తేడా ఉంది లేండి.

ఏ విధంగా చూసినా మ‌న దేశంలో ప‌న్ను ఎగ‌వేత‌దారులను ప‌ట్టుకోలేం కానీ టికెట్ కొనుగోలు లేకుండా అడ్డ‌దారుల్లో ప్ర‌యాణించే వారిని మాత్రం బాగానే ప‌ట్టుకుని వీలున్నంత మేర డ‌బ్బులు గుంజి పంప‌గ‌లుగుతున్నాం. ఈ ప్రాసెస్ లో కొంత మాత్రం చ‌లానా రూపంలో రైల్వేకు వెళ్లినా ఆ మొత్త‌మే ఓ రీజియ‌న్ కు సంబంధించి కోట్ల‌లో ఉండ‌డం విశేషం. కానీ ఇక్క‌డ మ‌రో విష‌యం గ‌మ‌నించాలి.. గ‌త ఏడాది క‌న్నా ఇప్పుడు క‌లెక్ట్ చేసి ఫైన్ ఎమౌంట్ వెయ్యి రెట్లు అధికం. కేసులూ, జరిమానాలూ రెండూ విధించి దాఖ‌లాలు కూడా అధిక‌మేన‌ని ఇదంతా త‌మ ప‌నితీరుకు సంకేత‌మ‌ని సంబంధిత అధికారులు కాల‌ర్ ఎగ‌రేసి మ‌రీ ! చెబుతున్నారు.

నిబంధ‌న‌లు ఎన్ని ఉన్నా కూడా మ‌న దేశంలో ఏ కొద్ది మంది మాత్ర‌మే పాటిస్తారు. నిబంధ‌న‌లు ఉన్నా కూడా మాకెందుకులే అని వ‌దిలేస్తారు. దేశాన్ని చుట్టి వ‌స్తున్న భార‌తీయ రైల్వే నిబంధ‌న‌ల అమ‌లులో ముందు ఉంటోంది. ప్లాట్ ఫాం టికెట్ ద‌గ్గ‌ర నుంచి స‌ర‌కు రవాణా వ‌ర‌కూ అనేకం అయిన ఛార్జీలు వ‌సూలుకు సిబ్బందిని నియ‌మించింది. కానీ దేశంలో చాలా వ‌స్తువులు లేదా స‌ర‌కులు అధికారుల క‌న్నుగ‌ప్పి అక్ర‌మంగా ర‌వాణా అయిపోతున్నాయి.

ఇదేమ‌ని ప్ర‌శ్నించిన అధికారుల‌పై కొన్ని సార్లు భౌతిక దాడులు జ‌రిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమ‌యినప్ప‌టికీ టిక్కెట్టు లేని ప్ర‌యాణం ప్ర‌మాద‌కరం అని అంటోంది రైల్వే శాఖ. కానీ చాలా మంది ఇవాళ్టికీ ఈ మాట వినిపించుకోవ‌డం లేదు. దేశంలో టికెట్ లేకుండా ప్ర‌యాణించిన వారిని అడ్డుకుని, విధుల్లో భాగంగా జ‌రిమానాలు విధించినప్ప‌టికీ మార్పు రావ‌డం లేదు. ఈ కోవ‌లో ఈశాన్య రాష్ట్రాల ప‌రిధిలో టికెట్ లేని ప్ర‌యాణం చేసిన వారి నుంచి అధికారులు అక్ష‌రాలా ఇర‌వై మూడు కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news