పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భనం, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలపై వాయిదా తీర్మాణాలు ఇస్తున్నాయి. టీఎంసీ ఎంపీలు పెరుగుతున్న నిత్యావసర ధరలపై చర్చించాలని కోరుతూ.. తీర్మాణాలు ఇచ్చాయి.
ఇదిలా ఉంటే కులగణన జరగాలనే అంశంపై పార్లమెంట్ లో చర్చను కోరుతూ వాయిదా తీర్మాణం ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. లోక్ సభలో టీఆర్ఎస్ నాయకుడు నామానాగేశ్వర్ రావు ఈ తీర్మాణం ఇచ్చారు. రాజ్యసభలో కేశవరావు తీర్మాణం నోటీసులను అందించారు. టీఆర్ఎస్ పార్టీ గతం నుంచి కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంట్లో భాగంగానే పార్లమెంట్ లో చర్చను లేవదీసేందుకు టీఆర్ఎస్ ఎంపీలు కులగణనపై వాయిదా తీర్మాణాన్ని ఇచ్చారు.
ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారు. ఇటీవల కేంద్రంలో ఉద్యోగాల భర్తీపై ఇలాగే వాయిదా తీర్మాణం ఇచ్చారు. అయితే దీనికి సభాపతి అనుమతించకపోవడంతో ఉభయసభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. మరోవైపు ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా పార్లమెంట్ లో లేవనెత్తుతున్నారు.