ఆ ఎమ్మెల్యే సొంత సామాజికవర్గమే ముద్దంటున్నారా

-

చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు హాట్ టాపిక్‌ అయింది. సొంత సామాజికవర్గాన్ని తప్ప పార్టీలో ఉన్న ఇతర వర్గాల కేడర్‌ను పట్టించుకోవడం లేదట. జిల్లా మంత్రి హెచ్చరించినా ఆయన వ్యవహారంలో మార్పు లేదట. సొంత సామాజిక వర్గమే ముద్దంటున్న ఆ ఎమ్మెల్యే పై జిల్లాలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుందట…

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆరణి.. 2014లో జగన్ వెంట నడిచారు. ఆ ఎన్నికల్లో మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు సతీమణి టీడీపీ అభ్యర్ధి సత్యప్రభ చేతిలో ఓడిపోయారు. చివరికి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మనోహర్ పై విజయం సాదించారు. మొత్తానికి రెండుసార్లు పోరాటం తర్వాత ఎట్టకేలకు ఫ్యాన్‌ గాలిలో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారనే టాక్‌ పార్టీ కేడర్‌లో జోరందుకుంది.

సొంత సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. నియోజకవర్గంలో పోలీసులు, ప్రభుత్వ అధికారుల్లో ఎక్కువమంది తనవారే ఉండాలని పట్టుబడుతున్నారట. గతంలో జడ్పీ కార్యాలయ అధికారుల బదిలీలో సొంతవారికే పోస్టింగ్‌లు ఇప్పించడంతో జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుతిమెత్తంగా హెచ్చరించారని సమాచారం. మార్కెట్లో షాపుల కేటాయింపులో ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు డిమాండ్‌ చేయడం వివాదానికి దారితీసింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని మిగిలిన సామాజికవర్గానికి చెందిన పార్టీ కేడర్‌ రగిలిపోతున్నట్లు సమాచారం.

చిత్తూరులో రోడ్డు విస్తరణ పనులు, తాగునీటి సమస్య అలాగే ఉండిపోయింది. ఈ సమస్యలపై టీడీపీ ఆందోళనలు చేస్తోంది. అయినా సరే సమస్యలు వద్దు.. సామాజికవర్గమే ముద్దు అన్నట్టు ఎమ్మెల్యే ఆరణి వెళ్తుండటంపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా టీడీపీలో ఉన్న తన సామాజికవర్గాన్ని ఎమ్మెల్యే చేరదీస్తున్నరనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో కాంట్రాక్టులు, మైనింగ్‌లో ఆయన అనుచరులు చెప్పిందే వేదంగా మారిపోయిందట. ఈ అంశాలపై జిల్లా మంత్రికి ఫిర్యాదు చేశారట పార్టీ నాయకులు. ఒకవేళ ఎవరైనా నాయకులు ప్రశ్నిస్తే మాత్రం.. మీరు నాకు ఎన్నికల్లో పనిచేయలేదు.

పాపం ఇన్నాళ్లు ఎదురు చూసిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు.. వైసీపీ అధికారంలో ఉన్నా.. తాము మాత్రం ప్రతిపక్షంలో ఉన్నామనే ఫీలింగ్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. మరి..ఈ సమస్యపై పార్టీ పెద్దలు ఫోకస్‌ పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news