KHILADI : “ఖిలాడీ” మసాలా సాంగ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ కు ఇక జాతరే

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ..తాజాగా చేస్తున్న మూవీ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో.. రూపొందుతన్న ఈ సినిమాను ఏ స్టూడియేస్‌ ఎల్‌ ఎల్పీ పతాకంపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు.

ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా కిలాడి మూవీ నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి 5వ పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. క్యాచ్ మీ అనే 5వ సాంగ్ ను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది చిత్రబృందం. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news