ఏపీ సీఎస్ కి బాబు లేఖ.. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలి !

-

ఏపీ సిఎస్ నీలం సహానీకి చంద్రబాబు సుదీర్ఘ లేఖ రాశారు. ఏపీలో విచ్చలవిడిగా కరోనా వ్యాప్తి, ఫ్రంట్‌లైన్ వారియర్ల భద్రత, టెస్టింగ్ సరళిలో మార్పులు, చికిత్సా సౌకర్యాల మెరుగు పరిచేందుకు సీఎస్ కు చంద్రబాబు లేఖ ద్వారా సూచనలు చేశారు. కరోనా ప్రారంభం నుంచి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూనే ఉన్నా పెడచెవిన పెట్టిన పర్యవసానంగా రాష్ట్రం మొత్తం కరోనా వ్యాపించిందని ఆయన పేర్కొన్నారు. కేసులు 4 లక్షలు దాటిపోయినా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఇప్పటికి అయినా ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ పిపిఈలు అందించాలని ఆయన కోరారు.

అలానే ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియరకు రూ 50లక్షలు ఆర్ధిక సాయం వెంటనే అందించాలని అన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేయరాదన్న ఆయన జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. కరోనా బారినుంచి గట్టెక్కాలంటే RT-PCR పరీక్షలను మరింత ఎక్కువ సంఖ్యలో నిర్వహించడంపైనే మన దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. తాత్కాలిక ఆసుపత్రుల విస్తృతికి మిషన్ మోడ్‌లో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన సరైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ది కోసం, ఈ కోవిడ్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశంగా తీసుకోవాలని అన్నారు. జీవనోపాధి సాయం కింద ప్రతి పేద కుటుంబానికి రూ 10,000 చొప్పున అందించాలని, తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలు అన్నింటికీ 2020 ఏప్రిల్ నుండి నవంబర్ దాకా, జీవనోపాధి నిమిత్తం భత్యం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news