ఏపీలో మరో 3 పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

-

భారత దేశవ్యాప్తంగా క్రియా శీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే…. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని మూడు రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి నమోదైన మూడు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రంలో నమోదైన భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవా సమూహం పార్టీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితా నుంచి తొలగించినట్లు ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ నిర్ణయం పై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news