జీఎస్‌టీ చెల్లించే వారికి శుభవార్త: కేంద్రం..!

-

జీఎస్‌టీ చెల్లించే వారికి కేంద్రం తీపి కబురు చెప్పింది. కరోనా నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ట్యాక్స్ రిఫంట్ డ్రైవ్‌ను స్టార్ట్ చేసింది. దీని కారణంగా చాల మంది ప్రయోజనాలు పొందుతారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

లిక్విడిటీ సమస్యలు వ్యాపారులుకి కలుగకుండా ఉండాలి అని దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా మంది వ్యాపారులు ఇబ్బందులు అనేక సమస్యలని ఎదుర్కొంటున్న సంగతి తెలిసినదే.

ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వలన కేంద్రం వీరికి బాగా రిలీఫ్ కలుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిఫండ్ చెల్లింపులు వెంటనే పూర్తి కానున్నాయి. వ్యాపారులకు జీఎస్‌టీ రిఫండ్ వెంటనే క్రెడిట్ అవుతుంది.

మే 15 నుంచి మే 31 వరకు ప్రత్యేకమైన జీఎస్‌టీ రిఫండ్ చెల్లింపు డ్రైవ్‌ను నిర్వహించాలని సీబీఐసీ ఇప్పటికే సిద్హం అవుతోంది. మే 14 వరకు పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్స్ అన్ని మే 31లోపు సెటిల్ కానున్నాయి. రిఫండ్ సెటిల్‌మెంట్‌కు 60 రోజుల దాకా గడువు ఉంటంది. కానీ జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్ అప్లికేషన్ వచ్చి 30 రోజుల్లోనే సెటిల్‌మెంట్ పూర్తి చేయాలని కేంద్రం అంది.

Read more RELATED
Recommended to you

Latest news