బ్లాక్ ఫంగస్ దెబ్బకు దక్షినాది రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కాస్త కఠిన చర్యల దిశగా వెళ్తున్నాయి. మరో పక్క ప్రజలకు అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ లో కేసులు అక్కడక్కడ నమోదు అవుతున్నా సరే మరణాలు కూడా ఉన్నాయి.
దీనితో కరోనా వచ్చి తగ్గిన వారిలో ఆందోళన మొదలయింది. ఏం జరగబోతుంది అనే భయం కూడా నెలకొంది. ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఆందోళన మొదలయింది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారిన 12 మంది పడ్డారు. మార్కాపురం పట్టణంలో ఏడుగురికి బ్లాక్ ఫంగస్ సోకింది. బ్లాక్ ఫంగస్ భారిన పడి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారని తెలుస్తుంది. దీనితో అధికారులు అలెర్ట్ అయ్యారు.