కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇది రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరిక పూర్తి వివరాలను చూస్తే.. రైతులు ఇక మీదట పురుగుల మందు ని ఆన్ లైన్ లో కొనచ్చుట. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకు వచ్చింది. ఇకామర్స్ వెబ్‌సైట్ల ద్వారా పెస్టిసైడ్స్ ను ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా రైతులు కొనొచ్చు.
అందుకోసమే పెస్టిసైడ్స్ రూల్స్‌ను కేంద్రం మార్చింది. సో ఇక మీదట అన్నదాతలు పెస్టిసైడ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనొచ్చు. ఇంటి వద్దకే డెలివరీ వస్తుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అయితే ఒక్కో చోట ఇవి మనకు అందుబాటులో వుండవు. అలాంటప్పుడు రైతులకి ఇబ్బంది కలగొచ్చు. కంపెనీల ప్రొడక్టులు పూర్తి స్థాయిలో ఉండకపోతే ఇబ్బందే. కానీ ఇప్పటి నుండి మాత్రం ఆ సమస్యలు ఉండవు.
ఆన్‌లైన్ లో పెస్టిసైడ్స్ ని తీసుకో వచ్చు. వెబ్‌సైట్ల ద్వారా పెస్టిసైడ్స్ ని సేల్ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకే ఇన్‌సెక్టిసైడ్ యాక్ట్‌ను సవరించింది. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు మాత్రమే వీటిని విక్రయించడానికి అవుతుంది. ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్‌ను విక్రయించడానికి కంపెనీలు పక్కా లైసెన్స్ ని కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్‌ను విక్రయించాలి.