తెలంగాణకు కేంద్రం శుభవార్త..ఉప్పుడు బియ్యంపై కీలక ప్రకటన

-

తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల పై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. 2021-22 రబీ సీజన్ కుగాను తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ ద్వారా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్) సేకరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ. ఇప్పటికే తెలంగాణలో 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరిస్తున్న కేంద్రం… దీనికి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అంగీకారం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version