ఈ లోన్‌ యాప్స్‌తో జాగ్రత్త.. అలర్ట్‌ చేసిన కేంద్రం

-

మన దేశం లో గత సంవత్సరాల నుండి ఎలా ఊపు అందుకుందో తేలిసిందే. అదే రీతిగా ఆన్‌లైన్‌ లో మోసాలు కూడా అంతే వేగంగా పెరిగాయి. రుణ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడిచారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లేకుండా లావాదేవీలు జరుపుతున్నాయి. సిబిల్‌ స్కోర్‌, ఇతర పత్రాలు ఏవీ లేకుండా రుణాలు ఇస్తూ ఆ తర్వాత రుణగ్రహీతలను బాగా ఇబంది పెడుతున్నాయి. ఇప్పటికే వేధింపులకు గురి చేస్తున్న 50కి పైగా లోన్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బాన్ చేసింది.

274 Fake Loan Apps Come Under Police & RBI Scanner For Major Violations,  Check Full List Here - The420CyberNews

పలు యాప్‌లు దేశాలకు చెందిన సంస్థలను నిర్వహిస్తున్నాయని, ఎవరైనా సైబర్‌ నేరాల బారినపడితే బాధితులు 1930 డయల్‌ చేయాలని లేదంటే.. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపింది. ప్రభుత్వం హెచ్చరించిన రుణ యాప్‌లలో విండ్‌మిల్‌ మనీ , ర్యాపిడ్‌ రూపీ ప్రో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు యాప్‌లు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఓ వినియోగదారుడు ట్విట్టర్‌లో స్క్రీన్‌ షాట్లను పెట్టాడు. విండ్‌మిల్‌ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా.. ర్యాపిడ్‌ రూపీ ప్రో యాప్‌ను తొలగించడం జరిగింది. యాప్‌లో రివ్యూలన్నీ మోసాలకు పాల్పడుతున్నట్లు ఉన్నాయ్. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా .. విండ్‌మిల్‌ యాప్‌ను ఎస్టిసిఐ మరీ డీలర్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. అయితే ఎస్టిసిఐ సైట్‌లో ఈ యాప్‌ను కంపెనీ అభివృద్ధి చేయలేదని, తమకు సంబంధం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా యాప్‌లో రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news