అనుభవం ఉందనే 2014 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారని, అమరావతి చంద్రబాబుకు అవినీతి కామధేనువన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లడుతూ.. పోలవరం చంద్రబాబు ఏటీఎం అని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల లావాదేవీలకు కోడింగ్ ఉపయోగించిన తీరును ఐటీ నోటీసుల్లో బయటపడ్డాయని, దీని పై ఎందుకు స్పందించడం లేదు?? అని ఆయన ప్రశ్నించారు. ఈ అభియోగాలు నిజం కాకపోతే ఐటీ శాఖ పై పరువు నష్టం దావా వేయరా?? అని ఆయన అన్నారు.
ఓటుకు నోటు ఉదంతంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, చంద్రబాబు విజనరీ లీడర్ కాదని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును తరిమి కొట్టారన్నారు. చంద్రబాబు ఒక పొలిటికల్ స్కాంస్టర్, 118 కోట్ల ఈ అవినీతి చంద్రబాబు అవినీతిలో ఒక తునక మాత్రమేనన్నారు. ఈ అంశాల పై మేం కూడా సమాచారం సేకరిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన జగన్ మినహా మరో ముఖ్యమంత్రి ఎవరూ లేరని, జమిలి విధివిధానాల చూసిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.