ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇది గమనించారా?

-

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల ఆరోగ్య పథకాలతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై కో-బ్రాండింగ్‌ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లోగో ఉన్న ఈ కార్డులపై ఆయా రాష్ట్రాల లోగోను కూడా కలిగి ఉంటాయి.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంలోకి చేరాయి. ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ పథకానికి దూరంగా ఉండగా.. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2018లో ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5లక్షల వరకు ట్రీట్‌మెంట్ అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news