ఇండియాలోనే సీఎం కేసీఆర్ పెద్ద మొనగాడని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కొనియాడారు. గురువారం.. వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ ఢీ కొట్టిన ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ నని… బీజేపీ పార్టీ అధికారం లేని.. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. ప్రధాని మోడీని, ఆయన సర్కార్ ను పడగొట్టాలని పిలుపునిచ్చారు. లేకపోతే.. ఇండియానే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను దేశ యువత గుర్తుంచుకోవాలని కోరారు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. సీఎం కేసీఆర్ తరహాలోనే.. అందరూ కేంద్రం పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. లేకపోతే.. ప్రమాదం తప్పదని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.