అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న వేళ… కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశానికి షాకిచ్చింది. పెట్రోొల్, డీజిల్ పై సుంకాన్ని రూ.3 వరకూ పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ. 8 కి, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం రూ.4 లకు చేరుకుంది. అటు పెట్రోల్, డీజిల్ పై ఉన్న రోడ్డు సెజ్ ను రూ.1 మేర పెంచింది. ఈ నిర్ణయంతో కేంద్రానికిి రూ.39 వేల కోట్ల వరకూ లాభం చేకూరనుండగా వాహనదారులపై పరోక్ష భారం పెరగనుంది.
ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రభుత్వ ఆదాయం కూడా బాగా తగ్గింది. ఇంకా ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మోదీ సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు బాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వం ధరలు తగ్గించడం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుంకం పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని రాజకీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారో …