కీలకమైన మున్సిపల్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ముగిశాయి. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానిపై రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే నేతల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో ఇప్పటికే వాళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. గంటా శ్రీనివాసరావు కచ్చితంగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే ఒకరు బయటకు రావడానికి సిద్ధమయ్యారు.
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు బయటకు వచ్చే దానికి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కడప జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటకు వచ్చేయడానికి రెడీ అవుతున్నారు. దాదాపు నెల రోజుల్లో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. కృష్ణా జిల్లాలో కూడా విజయవాడ పరిధిలో ఇద్దరు నేతలు అలాగే బందరు పార్లమెంట్ పరిధిలో దాదాపు ముగ్గురు నేతలు పార్టీ మారవచ్చని టాక్. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొంతమంది విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది.