బెయిల్ మీద విడుదలైన చందాకొచ్చర్.. కానీ..

-

ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి ముంబై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 5లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసి కొన్ని షరతులను పెట్టింది. మనీ లాండరింగ్ కేసులో చందాకొచ్చర్ పై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చందాకొచ్చర్ తో పాటు తన భర్త కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోయిన సంవత్సరం సెప్టెంబరులో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చార్ అరెస్టయ్యాడు. ఆయన ఇప్పటికీ జైళ్ళోనే ఉన్నాడు. వీరిద్దరికీ ఏ విషయం నిమిత్తమైనా ఇతర దేశానికి వెళ్ళకూడదని ముంబై కోర్ట్ పేర్కొంది.

2019ఫిబ్రవరిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పై క్రిమినల్ కేసులు దాఖలు చేసారు. వీడియో కాన్ గ్రూపు వేణూగోపాల్ దూత్ తో కలిసి బ్యాంకు పాలసీలకి విరుద్దంగా 1867కోట్ల రుణాలను మంజూరు చేసారన్న ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. చందాకొచ్చర్ పదవీ కాలంలో ఇచ్చిన మరో రెండు లోన్ల ఈడీ పరిశీలిస్తుంది. ప్రస్తుతానికి చందాకొచ్చర్ కి బెయిలు లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news