ఉద్రిక్తల నడుమ ఉత్తరాంధ్ర కు వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. భద్రతా కారణాలతో చంద్రబాబు పోలీసులు అరెస్ట్ చేసారు. గురువారం ఉదయ౦ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. ఈ నేపధ్యంలోనే వైసీపీ కార్యకర్తలు అందోళనలకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయం బయట తన కాన్వాయ్‌లోనే సుమారు మూడు గంటలసేపు ఉన్నారు.
పోలీసులు కూడా చంద్రబాబుని ముందుకి కదలనీయలేదు. అనంతరం వాహనం నుంచి దిగి పోలీసుల వైఖరిని నిరసిస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు… మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కాసేపటికే పోలీసులు చంద్రబ్బుని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ వెస్ట్‌జోన్ ఏసీపీ పేరుతో సెక్షన్ 151 కింద చంద్రబాబుకి పోలీసులు నోటీసు ఇచ్చారు.
అక్కడి నుంచి చంద్రబాబుని ఎక్కడికి తరలిస్తారు అనేది తెలియలేదు. విశాఖలో వేరే కార్యక్రమాలకు వెళ్లాలని చంద్రబాబు పోలీసులను కోరారు. అయినా సరే అంగీకరించలేదు. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టీడీపీ కార్యాకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు వైసీపీ కార్యాకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు.